- ముఖ్య అతిథిగా హాజరైన మైనారిటీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి అజారుద్దీన్
జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు(Praja Palana Dinotsavam) ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి అజాహారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జగిత్యాల జిల్లాలో(Jagtial District) స్మార్ట్ రేషన్ కార్డులు, చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, మహిళా సంఘాలకు రుణాలు తదితర పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజగౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
