Homeమహబూబ్‌నగర్‌Medical Achievement | చల్లంపల్లిలో ఒకే ఇంటి నుంచి ఇద్దరు డాక్టర్లు!

Medical Achievement | చల్లంపల్లిలో ఒకే ఇంటి నుంచి ఇద్దరు డాక్టర్లు!

  • అక్కాచెల్లెళ్ల వరుస విజయాలు.. గ్రామీణ ప్రతిభకు అరుదైన గుర్తింపు
  • రెండేళ్ల క్రితం హారిక.. తాజాగా జ్యోతిర్మయి.. కుటుంబంలో ఆనందోత్సాహం

గ్రామీణ గడ్డపై పుట్టి.. వైద్య విద్యలో అడుగుపెట్టి.. తమ ప్రతిభతో కుటుంబానికే కాదు గ్రామానికి కూడా గర్వకారణంగా నిలిచారు ఆ అక్కాచెల్లెళ్లు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చల్లంపల్లి గ్రామానికి చెందిన గుర్క కుటుంబంలో వరుసగా ఇద్దరు కుమార్తెలు ఎంబీబీఎస్‌ మెడికల్‌ సీట్లు సాధించడం(Medical Achievement) విశేషంగా నిలిచింది. రెండేళ్ల క్రితం అక్క గుర్క హారిక ఎంబీబీఎస్‌ సీటు సాధించగా.. తాజాగా చెల్లెలు గుర్క జ్యోతిర్మయి సైతం ఎంబీబీఎస్‌ మెడికల్‌ సీటు సాధించి తన ప్రతిభను చాటుకుంది.

గుర్క రామకృష్ణ,మంజుల దంపతుల కుమార్తె జ్యోతిర్మయి నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సాధించడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి పెంచుకుని,లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగిన జ్యోతిర్మయి తన కృషితో ఈ విజయాన్ని అందుకుంది.ఇదే కుటుంబానికి చెందిన పెద్ద కుమార్తె గుర్క హారిక కూడా రెండేళ్ల క్రితం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ మెడికల్‌ సీటు సాధించి వైద్య విద్యలో అడుగుపెట్టింది.ఇప్పుడు చెల్లెలు జ్యోతిర్మయి కూడా అదే బాటలో పయనించడంతో గుర్క కుటుంబం వైద్య విద్యలో అక్కాచెల్లెళ్ల విజయాలకు వేదికగా మారింది.

- Advertisement -

గ్రామీణ ప్రతిభకు స్ఫూర్తిMedical Achievement

గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు వసతులు,మార్గదర్శకత్వం వంటి అంశాల్లో కొన్ని సవాళ్లు ఎదురైనా.. పట్టుదల,క్రమశిక్షణ,కష్టపడి చదివే తత్వం ఉంటే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని హారిక,జ్యోతిర్మయి విజయాలు చాటిచెబుతున్నాయి.ఒకే కుటుంబం నుంచి ఇద్దరు కుమార్తెలు వైద్య విద్యలో సీట్లు సాధించడం చల్లంపల్లి గ్రామ విద్యార్థులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తోంది.మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తే.. ఆ వెలుగు ఒక కుటుంబానికే పరిమితం కాదు.. సమాజానికంతా స్ఫూర్తినిస్తుంది. గుర్క అక్కాచెల్లెళ్ల విజయాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తల్లిదండ్రుల ఆనందం

తమ ఇద్దరు కుమార్తెలు వరుసగా ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడంపై తల్లిదండ్రులు గుర్క రామకృష్ణ, మంజుల దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.తమ పిల్లల చదువుకు సహకరించిన కుటుంబ సభ్యులు,ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.హారిక,జ్యోతిర్మయి భవిష్యత్తులో వైద్యులుగా ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.గ్రామీణ గడ్డ నుంచి వైద్య రంగంలోకి అడుగుపెడుతున్న ఈ అక్కాచెల్లెళ్ల విజయగాథ.. చల్లంపల్లి పేరును మరింత ప్రత్యేకంగా నిలిపింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News