- ఎమ్మెల్యే ప్రకటనకు కట్టుబడి ఉండాలి.
- జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్..
వనపర్తి: బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్పై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్,(Gattu Yadav) జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నివాసంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే అభివృద్ధి రాజకీయాలపై ప్రకటన చేసిన 24 గంటల్లోనే ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో పది మందిపై కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు.
క్రైమ్ నంబర్ 42/2026, సెక్షన్ 352 కింద నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిందితులను పట్టుకోకపోవడంపై పోలీసుల తీరును విమర్శించారు. కార్యకర్తలపై కేసులు పెట్టడంలో చూపుతున్న చొరవను హత్య కేసు దర్యాప్తులోనూ చూపాలని అన్నారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలో వనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొంటూ, మిగిలిన రోడ్ల విస్తరణ పనులను పూర్తి చేయాలని సూచించారు. వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా అభివృద్ధిలో పోటీపడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో న్యాయవాది ఎన్ రాజు సాగర్, రాహుల్ రాథోడ్, గంధం పరంజ్యోతి, దొడ్ల రాములు, సూర్యవంశం గిరి, మాజీ సర్పంచ్ రమేష్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
