- డీజే నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు ఎస్ఐ కురుమూర్తి
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా డీజే నిర్వాహకులు పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కల్వకుర్తి ఎస్‌ఐ కురుమూర్తి(Kalwakurthy SI Kurumurthy) ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో డీజే నిర్వాహకులతో ఎస్సై కురుమూర్తి మాట్లాడుతూ, అనుమతించిన సమయం, పరిమితుల్లోనే సౌండ్ సిస్టమ్‌లను వినియోగించాలని తెలిపారు.
అధిక శబ్దంతో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బంది కలిగించరాదన్నారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత డీజేలు, సౌండ్ సిస్టమ్‌లు వినియోగించకూడదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా అదనపు సౌండ్ బాక్సులు, ఇతర పరికరాలను ఏర్పాటు చేయరాదన్నారు.
అంతేకాకుండా డీజే వాహనాలు, పరికరాల ఏర్పాటుతో ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు ఇచ్చే సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన డీజే నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కురుమూర్తి హెచ్చరించారు.
గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
