Homeరంగారెడ్డిBJR Nagar | బీజేఆర్ నగర్ గౌడ సంఘానికి నూతన కమిటీ

BJR Nagar | బీజేఆర్ నగర్ గౌడ సంఘానికి నూతన కమిటీ

  • అధ్యక్షుడిగా దుబ్బాక రవీందర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

బీజేఆర్ నగర్‌తో (BJR Nagar)పాటు పరిసర కాలనీలకు చెందిన గౌడ కులస్తులు సమావేశమై గౌడ సంఘానికి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సభ్యులు తెలిపారు.

సంఘం అధ్యక్షుడిగా దుబ్బాక రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా మెరుగు బిక్షపతి, తండా ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బండకింద భరత్ గౌడ్, కోశాధికారిగా దంతూరి శివకుమార్ గౌడ్, సహాయ కార్యదర్శిగా దుబ్బాక నవీన్ గౌడ్ ఎన్నికయ్యారు.

- Advertisement -

సలహాదారులుగా వడ్లకొండ వెంకటేశ్వర్లు, మొక్తల శంకరయ్య గౌడ్, పుట్ట బిక్షపతి గౌడ్ ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బి.ఈశ్వర్ గౌడ్, బి.కృష్ణ గౌడ్, ఎన్.వెంకన్న గౌడ్, దంతూరి రజినీకుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దుబ్బాక రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘంలోని ప్రతి సభ్యుడి అభిప్రాయాలను గౌరవిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. గౌడ సంఘం ఐక్యతను మరింత బలోపేతం చేసి, సభ్యుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

సంఘ సభ్యుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. నూతన కమిటీ ఎన్నికతో సంఘంలో నూతన ఉత్సాహం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News