Homeహైదరాబాద్‌Illegal Ration seized | 13 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Illegal Ration seized | 13 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

  • సీసీసీ ఆర్‌కే–5 కాలనీలో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దాడి
  • అక్రమంగా నిల్వ ఉంచిన 13 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

సీసీసీ ఆర్‌కే–5 కాలనీలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 13 క్వింటాళ్ల పీడీఎస్‌ రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు(Illegal Ration seized). విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఇంటిపై దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాజేందర్‌ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యాన్ని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సమాచారం.ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News