ఆర్థికంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా… ఈ మీడియా రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించడం సాధారణ విషయం కాదు. ఇది ఒక పత్రికగా మీకున్న నిబద్ధతకు, పట్టుదలకు, ప్రజల పట్ల మీ బాధ్యతకు
నిదర్శనం.
పత్రిక అంటే కొన్ని వర్గాల వారికి మాత్రమే అనే భావనకు కాలం చెల్లేలా ఆదాబ్ హైదరాబాద్‌ను ప్రజల పత్రికగా నిలబెట్టిన ఘనత సత్యం గౌడ్ విరమళ్ళ గారికే దక్కుతుంది.
మీ 15వ వార్షికోత్సవ వేడుకల్లో మా యూట్యూబ్(YOUTUBE) విభాగాన్ని కూడా గౌరవించి, విశిష్ట సేవలు అందిస్తున్న కొందరు జర్నలిస్టులను గుర్తించి, మీ ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కరించడం మాకు ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని కలిగించింది.
మా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఆదాబ్ హైదరాబాద్ యాజమాన్యానికి, సత్యం గౌడ్ విరమల్ల గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
15 ఏళ్ల విజయ ప్రస్థానం…..ఇక ముందు ఎన్నో దశాబ్దాల ఘన ప్రస్థానంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ Chairman- సత్యం గౌడ్ గారికి, CEO- వంశీ గారికి అలాగే ఆదాబ్ హైదరాబాద్ సిబ్బందికి హృదయపూర్వక 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
