సొంత గూట్లో మంట పెట్టుకుని, ఊరంతా ఆర్పమంటే ఎట్లయితది? కంటికి నలుసై తోటి లీడర్ల మీద, ఆఖరికి సీఎం మీదనే సొంత బిడ్డతోటి మాటలు అనిపిస్తే ఏఐసీసీ ఊరుకుంటదా? పిలవని పేరంటానికి పోయినట్టు గాక.. అధిష్ఠానం పిల్చినాక హుటాహుటిన ఢిల్లీ బాట పట్టి, ‘తప్పు నాది కాదంటే నాది కాదు’ అని మొరపెట్టుకున్నంత మాత్రాన చేసిన గాయం మాయమైతదా? రాజకీయంలో ఓపిక, మాట తీరు లేకపోతే ఎంతటి పదవి ఉన్నా అది చేతిల ఉన్న చాపకింద నీళ్లే అని ఈ ఢిల్లీ పంచాయితీ తేల్చి చెప్తున్నది.
- బీవీఆర్ రావు
- Advertisement -
