ఈ ప్రపంచం నుంచి ఒక స్త్రీ వెళ్లిపోతే… కేవలం ఆమె భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు మాత్రమే ఏడవరు.. ఆమెతో పాటు ఆ ఇల్లు కూడా ఏడుస్తుంది. ఆమె అడుగులు పడిన వాకిలి ఏడుస్తుంది. ఆమె చేతులు తాకిన గోడలు ఏడుస్తాయి. ఆమె నవ్వును విన్న గదులు మూగబోతాయి. ఆమె ప్రేమతో వండిన వంట పాత్రలు కూడా ఆమె కోసం ఎదురుచూస్తున్నట్టే అనిపిస్తాయి.. ఆమె పూజ చేసుకున్న దేవుడి గది.. ఆమె భక్తితో పూజించిన తులసి కోట.. ఇవన్నీ ఆమె జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి… ఎందుకంటే ఆమె కేవలం ఆ ఇంట్లో ఉండే ఒక మనిషి కాదు ఆ ఇంటికి ప్రాణం. ఆ కుటుంబానికి ఆత్మ. అందుకే స్త్రీ ఉన్నప్పుడే ఆమెను ప్రేమించండి… ఆమె ఉన్నప్పుడే ఆమె విలువ తెలుసుకోండి… ఆమె మనసును అర్థం చేసుకోండి… ఆమెకు గౌరవం ఇవ్వండి… ఎందుకంటే ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకాలను ఎంత ప్రేమించినా… ఆమెను తిరిగి మన జీవితంలోకి తీసుకురాలేం. స్త్రీ ఒక బంధం కాదు…ఒక భావోద్వేగం. ఒక మనిషి కాదు.. మన జీవితాన్ని నింపే ఒక ఆత్మ..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
