Homeనిజామాబాద్‌Help | అయ్యా సాయం చేయండి..!

Help | అయ్యా సాయం చేయండి..!

  • నడుం చచ్చిపడి ఏడేళ్లుగా కదలేని స్థితిలో మంచం పైనే..
  • చిన్నారుల భవిష్యత్తు కోసం తండ్రి ఆర్తనాదం!
  • అమ్మ, భార్య, అనారోగ్యంతో బాధపడుతున్నారు.
  • కదలలేని శరీరం.. ఆపరేషన్లతో ఆగిన సంసారం: ఆదుకోండి మహాప్రభో!
  • సాయం చేయాలని వేడుకుంటున్నా తాడ్వాయి మర్రి భాస్కర్..
  • ఎమ్మెల్యే మదన్మోహన్ కుటుంబాన్ని ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్న దివ్యాంగుడు భాస్కర్..

అయ్యా సాయం చేయండి..చేతులెత్తి మొక్కుతున్నా నన్ను బతికించకపోయినా నా పసిపిల్లల భవిష్యత్తుకైనా కాస్త భరోసానివ్వండి. నా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోండి అంటూ దివ్యాంగులు సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్న తాడ్వాయి మండల కేంద్రంనికి చెందిన మర్రి భాస్కర్ అనే దివ్యాంగుడి కన్నీటి కథ ఇది. ఏడేళ్ల క్రితం ఓ బైక్ ప్రమాదంలో వెన్నుపూస గాయపడింది. ఆపరేషన్ చేసిన సక్సెస్ కాలేదు ఏడేళ్లుగా అతను మంచానికే పరిమితమయ్యాడు.

అతనికి మంచం పైనే కుటుంబ సభ్యులు సేవలు చేస్తున్నారు. దీనికి తోడు కొంత కాలం క్రితం భాస్కర్ తల్లికి బ్రెయిన్ ఆపరేషన్ కాగా, భార్యకు గర్భసంచి ఆపరేషన్ జరిగిందన్నారు.దీంతో కుటుంబం ఆర్థికంగా ఎంతో కూచించిపోయింది. భాస్కర్ కు తండ్రి కొంతకాలం క్రితం చనిపోగా అతని భార్యే కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. భాస్కర్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని నడిపించే పెద్ద దిక్కు భాస్కర్ ఇలా మంచాన పడటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది. ఎవరైనా మనసున్న మాహరాజులు తనకు దయ తలచి, తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.

- Advertisement -

ఎమ్మెల్యే ఆదుకోవాలని విజ్ఞప్తి.

ఎన్నికల సమయంలో,ప్రచారంలో భాగంగా తన దగ్గరికి వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తను గెలిచక సాయం చేస్తానని మాట ఇచ్చాడని, ఇప్పుడు తన పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని తనకు ఓ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇప్పించి, తన కుటుంబానికి ఆర్థికంగా ఏదైనా సాయం చేయాలని భాస్కర్ వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్మోహన్ చాలామందికి,చాలా రకాలుగా సాయం చేశాడని, తనకు కూడా సాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకుంటున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News