- పెడల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని పెంచుతూ
- ప్రయాణమే వ్యాయామం.. సైకిల్‌పై ఉద్యోగానికి తాడ్వాయి యువకుడి పయనం
- ఏడాదిగా సైక్లింగ్ కొనసాగిస్తున్న తాడ్వాయి యువకుడు సూర్య ప్రకాష్ రెడ్డి నేటి యువతకు ఆదర్శం
తాడ్వాయి: ప్రస్తుత కాలంలో చిన్న దూరాలకు సైతం ద్విచక్ర వాహనాలు, కార్లను ఆశ్రయిస్తున్నవారు ఎందరో. అయితే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే సంకల్పంతో ఓ యువకుడు మాత్రం ప్రతిరోజూ ఉద్యోగ ప్రయాణంలో సైక్లింగ్‌కు ప్రాధాన్యమిస్తూ అందరికీ ఆదర్శంగా(Inspiration) నిలుస్తున్నాడు. ఆయనే తాడ్వాయి మండల(Tadwai Mandal) కేంద్రానికి చెందిన నిమ్మల సూర్య ప్రకాష్ రెడ్డి(Nimmala Surya Prakash Reddy) గత ఏడాది కాలంగా వారానికి నాలుగు రోజులు సైకిల్‌పై ఉద్యోగానికి రాకపోకలు సాగిస్తున్నాడు. తన స్వగ్రామం తాడ్వాయి నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని కామారెడ్డికి సైకిల్‌పై చేరుకుంటాడు. అక్కడి నుంచి కంపెనీ వాహనంలో బిక్కనూర్ టోల్ ప్లాజా కార్యాలయం తన ఉద్యోగ స్థలానికి వెళ్తాడు. తిరిగి సాయంత్రం కామారెడ్డికి చేరుకుని, అక్కడి నుంచి మళ్లీ సైకిల్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు.

కరోనా సమయంలో కొన్న సైకిల్‌తోనే ప్రయాణం
కరోనా సమయంలో సుమారు రూ.9 వేలతో కొనుగోలు చేసిన సైకిల్‌ను సూర్య ప్రకాష్ ఇప్పటికీ వినియోగిస్తున్నాడు. అదే సైకిల్‌పై ఉద్యోగానికి రాకపోకలు సాగిస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బస్సులు, ఆటోలు వంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, సైక్లింగ్ వల్ల శారీరక వ్యాయామం లభిస్తుందని భావించి ఈ అలవాటును కొనసాగిస్తున్నాడు.
యువతకు ఆదర్శంగా సూర్య ప్రకాష్ రెడ్డి(Inspiration)
ప్రస్తుత రోజుల్లో చాలామంది వ్యాయామం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో, 25 సంవత్సరాల సూర్య ప్రకాష్ రెడ్డి ఉద్యోగ ప్రయాణాన్నే వ్యాయామంగా మలుచుకోవడం విశేషం. ఆయన పట్టుదల, ఆరోగ్యం పట్ల చూపుతున్న శ్రద్ధ స్థానికులు, గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నాయి.

యువత అనవసరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ సైక్లింగ్, నడక, పరుగు వంటి శారీరక వ్యాయామాలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాన్ని తన ఆచరణ ద్వారా చాటుతున్న సూర్య ప్రకాష్ ప్రయాణం నేటి యువతకు మంచి సందేశంగా నిలుస్తోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
