Homeవరంగల్‌Celebrations | భక్తిశ్రద్ధలతో శ్రావణం మొక్కలు…

Celebrations | భక్తిశ్రద్ధలతో శ్రావణం మొక్కలు…

  • ఆఖరి శుక్రవారం ముత్యాలమ్మ గద్దెలకు పోటెత్తిన భక్తులు…

శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో మండలంలోని పలు గ్రామాల్లో ముత్యాలమ్మ గద్దల వద్ద భక్తులు పోటెత్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో చేరి అమ్మవారి మొక్కలను తీర్చుకున్నారు. తమను తమ కుటుంబాలను చల్లగా దీవించాలని, పాడిపంటలు పండి తమ గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలంటూ మొక్కులు మొక్కుకున్నారు. ఆయా గ్రామాల్లోని ముత్యాలమ్మ గద్దెల వద్ద జనాలు బారులు తీరారు. డప్పు వాయిద్యాల నడుమ పూనకాలతో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మను దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలంతో ముత్యాలమ్మ గద్దెల ప్రాంగణాలు పండగ శోభను సంతరించుకున్నాయి. గ్రామ దేవతలకు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య మొక్కులు సమర్పించుకున్న భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News