- ముఖ్య అతిథిగా వి.హెచ్.పి. జిల్లా సహ కార్యదర్శి, బజరంగ్దళ్ జిల్లా ఇంచార్జ్ మల్యాల రవి..VHP and Bajrang Dal Committees
- వి.హెచ్.పి. మండల అధ్యక్షులుగా గుడ్ల శ్రీధర్..
- బజరంగ్‌దల్ మండల కన్వీనర్‌గా పెండ్యాల సాయి శ్రీరామ్.
వరంగల్ జిల్లా, పర్వతగిరి మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో విశ్వహిందూ పరిషత్ పర్వతగిరి (VHP and Bajrang Dal Committees ) మండల సమావేశం గురువారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి భజరంగ్ దళ్ జిల్లా ఇంచార్జ్ మల్యాల రవి ముఖ్యఅతిథిగా పాల్గొని సనాతన ధర్మరక్షణ, దేవాలయాల పరిరక్షణ, దేశ రక్షణ కోసం పర్వతగిరి మండల నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
విశ్వహిందూ పరిషత్ పర్వతగిరి మండల ప్రథమ అధ్యక్షులుగా గుడ్ల శ్రీధర్, ఉపాధ్యక్షులుగా కొప్పు రవి, కార్యదర్శిగా పొలోజు శ్రీనివాస చారి, సహ కార్యదర్శిగా సముద్రాల శ్రీనివాస్, భజరంగ్ దళ్ మండల కన్వీనర్ గా పెండ్యాల సాయి శ్రీరామ్, గోరక్ష ప్రముఖ్ గా బైరి అఖిల్, సత్సంగ్ ప్రముఖ్ గా శివారెడ్డి, సత్సంగ్ సహ ప్రముఖ్ గా జూపూడి వెంకటేశ్వర్లు, సేవ ప్రముఖ్ గా చీధురి తిరుపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే బజరంగ్ దళ్ ప్రథమ కోఆర్డినేటర్ గా పెండ్యాల సాయి శ్రీరామ్, సహా కోఆర్డినేటర్ గా కందగట్ల యశ్వంత్, జంగా సంజయ్, గోరక్ష ప్రముఖ్ గా రాపర్తి రాణా ప్రతాప్, గో రక్ష సహ ప్రముఖ్ గా బాసాని అభిలాష్, సప్తహిక్ మిలన్ ప్రముక్ గా జూపూడి కృష్ణ చెతన్య, బలోపాసన ప్రముఖ్ గా మొగలి లోకేష్, బలోపాసన సహ ప్రముఖ్ గా జనగాం శ్రవణ్, విద్యార్థి ప్రముఖ్ గా సముద్రాల శివమణిలను నియమించడం జరిగింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
