Homeభక్తిYadagirigutta | శ్రావణ మాసం సందర్భంగా ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Yadagirigutta | శ్రావణ మాసం సందర్భంగా ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

  • భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. కొండకింద ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో రెండో హాల్లో లో ఉదయం 11 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ముత్తైదువులు లక్ష్మీ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొనే మహిళలకు దేవస్థానం తరఫున వ్రత పీట, కలశాలతో పాటు గాజులు, వ్రతానికి అవసరమైన సామగ్రిని ఉచితంగా అందజేశారు. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉందని ఆలయ పూజారులు తెలిపారు.

ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతం అని తెలిపారు. వరలక్ష్మీ దేవిని పూజించడం ద్వారా అష్టలక్ష్ములను పూజించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసమని వివరించారు. ధాన్యలక్ష్మీ, ధైర్యలక్ష్మీ, సంతానలక్ష్మీ, విజయలక్ష్మీ, విద్యాలక్ష్మీ, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ రూపాలలో అమ్మవారి కృప లభిస్తుందని తెలిపారు. కుటుంబాలలో సుఖసంతోషాలు, అష్టశ్వర్యాలు, ధనధాన్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ వివాహిత మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News