మునుగోడు నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేదలకు ‘ఈఎల్వీ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఈఎల్వీ భాస్కర్ అండగా నిలబడతారని ఆ సంస్థ మండల కోఆర్డినేటర్ అయితగోని నరసింహగౌడ్ స్పష్టం చేశారు. శనివారం భారత్ గార్డెన్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఆయన హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహగౌడ్ మాట్లాడుతూ..
నియోజకవర్గంలోని ఆపదలో ఉన్న ఏ కుటుంబానికైనా తమ వంతు సాయం అందించేందుకు ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. కష్టాల్లో ఉన్నవారి సమాచారాన్ని తమకు చేరవేస్తే, బృందం సభ్యులే నేరుగా వెళ్లి సహాయం అందిస్తారని, ఈ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
- Advertisement -
