- రూ. 10 లక్షల వ్ ఇళువైన 38 కేజీల ఎండు గంజా*యి స్వాధీనం..
హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీసులతో కలసి సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ భారీగా గంజా*యిని రవాణా చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.. రూ. 10 లక్షల విలువైన 38 కేజీల ఎండు గంజా*యి స్వాధీనం చేసుకున్నారు.. విశ్వసనీయ సమాచారం మేరకు, 21.08.2026న హైదరాబాద్ సిటీ సీసీఎస్ (CCS) క్రైమ్ టీమ్ సిబ్బంది, గాంధీనగర్ పోలీసులతో కలిసి అక్రమంగా ఎండు గంజా*యిని తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితుల వివరాలు :
- రాజారామ్ స్వామి కణ్ణు పడయాచి (78), వృత్తి : హోమ్‌స్టే, నివాసం : కే.ఎల్. కాలనీ, సచిన్ ఫోటో స్టూడియో వెనుక, గాంధీనగర్, కొప్రీ థానే ఈస్ట్, థానే జిల్లా, మహారాష్ట్ర. (స్వస్థలం: కడలూర్ జిల్లా, తమిళనాడు).
- సంతోష్ బలరామ్ ప్రజాపతి (65), వృత్తి: కూలీ, నివాసం: పరేల్, ముంబై, మహారాష్ట్ర.
- విజయలక్ష్మి కలియమూర్తి పిళ్ళై (66), నివాసం: రహమానియా స్ట్రీట్, భువనగిరి తాలూకా, మంజకుజి, కడలూర్ జిల్లా, తమిళనాడు.
- సిల్మినా కుజూర్ (36), వృత్తి: పనిమనిషి, నివాసం: అంధేరి వెస్ట్, ముంబై, మహారాష్ట్ర. (స్వస్థలం: గోమ్హా తోలి, బాగ్దేగా, సిమ్‌డేగా జిల్లా, జార్ఖండ్).
- శీలా దేవి (48), వృత్తి: పనిమనిషి, నివాసం: అంధేరి వెస్ట్, ముంబై, మహారాష్ట్ర. (స్వస్థలం: మిడిల్ గ్వాలా బస్తీ, టెల్కో, బిర్సా నగర్, ఈస్ట్ సింగ్‌భూమ్, జార్ఖండ్).
స్వాధీనం చేసుకున్న సొత్తు :
- రూ. 10,00,000 (పది లక్షల రూపాయిలు) విలువగల 38 కేజీల ఎండు గంజా*యి.
కేసు వివరాలు : నిందితులు విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతం నుంచి ముంబైకి గంజా*యిని రవాణా చేసే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన సూత్రధారి (అపరిచిత వ్యక్తి) సూచనల మేరకు, వీరు అరకులో బ్రౌన్ కలర్ పార్శిల్ కవర్లలో ప్యాక్ చేసిన ఎండు గంజా*యిని భారీ మొత్తంలో సేకరిస్తారు. అక్కడి నుంచి బస్సుల్లో హైదరాబాద్ చేరుకుని, ఆపై మరో బస్సు ద్వారా ముంబైకి తరలిస్తారు. ముంబై చేరుకున్న తర్వాత, ప్రధాన సూత్రధారి సూచించిన ప్రదేశాలలో ఈ గంజా*యి పార్సిళ్లను అప్పగిస్తారు.
నిందితుల వయస్సును ఆసరాగా చేసుకుని, పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ప్రధాన సూత్రధారి ప్రతి డెలివరీకి కొంత కమిషన్ ఇస్తూ వీరిని వాహకాలుగా వాడుకుంటున్నాడు. వీరికి గతంలో కూడా గంజా*యి రవాణా చేసిన నేర చరిత్ర ఉంది.
ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్ సిటీ డీసీపీ (సీసీఎస్, డిడి) ఎస్. చైతన్య కుమార్, ఐపీఎస్ పర్యవేక్షణలో సీసీఎస్ క్రైమ్ టీమ్ ఇన్‌స్పెక్టర్ ఛత్రాసి సుధాకర్ రావు, సబ్-ఇన్‌స్పెక్టర్ ఎన్. గౌరేందర్ గౌడ్, వారి బృందం, గాంధీనగర్ పోలీసుల సమన్వయంతో నిర్వహించారు.
నేర విధానం :
అరకులో బ్రౌన్ పార్సిళ్లలో ఉన్న గంజా*యిని సేకరించిన నిందితులు, వాటిని తమ సాధారణ ప్రయాణ సంచుల (లగేజ్ బ్యాగ్స్)లో దాచిపెడతారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో దొరక్కుండా ఉండేందుకు ఐదుగురూ వేర్వేరు బస్సుల్లో హైదరాబాద్ బయలుదేరతారు. వృద్ధులు, మహిళలు కావడం వల్ల సాధారణంగా ప్రయాణంలో తక్కువ అనుమానం వస్తుందనే అంశాన్ని వీరు ఆసరాగా చేసుకుంటారు. హైదరాబాద్ చేరుకున్నాక, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక రోజు పాటు వేర్వేరు లాడ్జీలలో బస చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ముంబై బస్సు ఎక్కి ప్రయాణించి నిర్దేశిత ప్రదేశాల్లో పార్సిళ్లను అప్పగిస్తారు. ప్రతి రవాణాకు గాను ఒక్కొక్కరికి సుమారు రూ. 10,000 నుండి రూ. 12,000 వరకు ప్రతిఫలం అందుతుందని విచారణలో తేలింది.
ప్రజలకు విజ్ఞప్తి :
గంజా*యి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు లేదా పంపిణీలో ఎవరూ భాగస్వాములు కావద్దని ప్రజలకు సూచించడమైనది. డబ్బుకు ఆశపడి ప్రైవేట్ వాహనాలు, బస్సులు లేదా ఇతర మార్గాల ద్వారా మత్తు పదార్థాలను రవాణా చేస్తూ క్యారియర్లుగా మారే వారిపై ఎన్.డీ.పీ.ఎస్. చట్టం కింద కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. గంజా*యి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై హైదరాబాద్ సిటీ పోలీస్ నిరంతరం నిఘా ఉంచుతుందని, నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేయడమైనది.
