Homeఆంధ్రప్రదేశ్Veligonda Project | చిరకాల స్వప్నం నెరవేరే క్షణాలు..

Veligonda Project | చిరకాల స్వప్నం నెరవేరే క్షణాలు..

  • వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశను ఆగస్టు 31న ప్రారంభం..
  • ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు..

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆగస్టు 31వ తేదీన ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మూడో విడత పరిహారంగా రూ.250 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 48 రోజుల్లోనే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రికార్డు స్థాయిలో పరిహారం అందించింది. మూడు విడతల్లో మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. తొలి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు అందించగా, శుక్రవారం మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు సీఎం చేతుల మీదుగా అందజేశారు. నిర్వాసితులకు ఇంకా రూ.132 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తయితే 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “1996లో నేనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేశాను. ఇప్పుడు 2026లో నా చేతుల మీదుగానే ప్రారంభించడం నా అదృష్టం. గత రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేసి మొదటి దశ పనులు పూర్తి చేశాం” అని తెలిపారు.

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉన్నా, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు నీరు రాకపోయినా, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. “వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2021లోనే పూర్తి కావాల్సింది. కానీ గత పాలకుల డ్రామాల వల్ల ఆలస్యమైంది. వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చిదిమేశారు. అయినా ‘సూపర్ సిక్స్’ వంటి పథకాలను అమలు చేస్తూనే, ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం” అని విమర్శించారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News