- నిబంధనలకు విరుద్ధంగా ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు..
- అనర్హులకు పెద్దపీట వేస్తూ, వేలాది రూపాయల విద్యా వ్యాపారం..
- హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీ రాం వెంకటేష్ కి వినతిపత్రం..
- అందజేసిన బైరు నాగరాజు గౌడ్, ఎన్.ఐ.ఎస్.యు స్టేట్ ప్రెసిడెంట్..
- కార్యక్రమంలో పాల్గొన్న ఆర్. సురేందర్ సింగ్, ఓయూ జేఏసీ..
నిబంధనలకు విరుద్ధంగా ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తున్న ఏ.వీ.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీపైకీ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్.ఐ.ఎస్.యు. స్టేట్ ప్రెసిడెంట్ బైరు నాగరాజు, ఓయూ జేఏసీ ఆర్. సురేందర్ సింగ్ హయ్యర్ సెక్రెటరీ, శ్రీరామ్ వెంకటేష్ కి వినతిపత్రం అందజేశారు.. 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ లో బి కేటగిరి సీట్ల భర్తీలో ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల చేసిన అవకతవకలపై విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ సీట్ల భక్తి విషయంగా ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ బి కేటగిరి సీట్ల భర్తీ నందు మెరిట్ ఫాలో కాకుండా, మెరిట్ లేని విద్యార్థులకు సీట్లను కేటాయిస్తూ మెరిటోరియల్ విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ.. విద్యను వ్యాపారం చేసి అంగట్లో సరుకులా తయారు చేస్తున్న వైనం. ఎం.వి.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల యందు గమనించవచ్చు.. రిసిప్ట్ నెంబర్ 189 తేదీ 4 – 7 – 2026 రోజున, దిక్కుల గౌతమ్ అనే విద్యార్థి ఎఫ్సెట్ ర్యాంక్ 47,278, ఇంటర్ మార్క్ లు 84శాతం బీసీ డీ కేటగిరీకి చెందిన విద్యార్థి సిఎస్ఎం కోర్సు కు అప్లికేషన్ పెట్టినప్పటికీని ఈ విద్యార్థిని కాదని 56శాతం ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు..
ఎఫ్సెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీట్లను కేటాయించకుండా.. మెరిట్ ను తుంగలో తొక్కి, మెరిట్ లేని విద్యార్థులకు సీట్లు కేటాయించి వేలాది రూపాయలు సొమ్ము చేసుకుని.. సిబిఐటి, ఎంజిఐటి ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ కోటాను బీ కేటగిరిని తమదిగా చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలపై విచారణ జరిపించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోగలరని కోరారు..
