Homeకరీంనగర్Mallesham Yadav | సభ్యుల సహకారం తోనే సంఘం అభివృద్ధి సాధ్యం.

Mallesham Yadav | సభ్యుల సహకారం తోనే సంఘం అభివృద్ధి సాధ్యం.

  • బాషవేణి మల్లేశం యాదవ్

మొగ్ధంపూర్ ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు బండి మల్లయ్య యాదవ్ అధ్యక్షతన సోమవారం రోజున గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా యూనియన్ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్ కురుమ, డైరెక్టర్ కాల్వ సురేష్ యాదవ్, జిల్లేల్ల పర్షరాములు యాదవ్, సందవేని ప్రసాద్ యాదవ్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లేశం యాదవ్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి సభ్యల సహకారం ఎంతో అవసరమని పరస్పర సహకారం తోనే సంఘాలు అభివృద్ధి సాదిస్తాయని అన్నారు.

తను ఎల్లవేళలా యాదవ కురుమ సోదరులకు సహకార సంఘం సభ్యులకు అందుబాటులో ఉంటానాని రానున్న రోజుల్లో గతంలో జిల్లా యూనియన్ నుండి ఋణాలు పొందిన సభ్యులకు వడ్డీ భారం తగ్గించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.అలాగే జిల్లా యూనియన్ నుండి సంఘం అభివృద్ధి కి త్వరలోనే ఒక మెడికల్ షాపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సహకార సంఘం మహాసభ ఏర్పాటు చేసి అందరిని కలుస్తామని వెల్లడించారు. తనతో పాటు తోటి డైరెక్టర్ లను ఘనంగా సన్మానించిన మొగ్దుంపూర్ గ్రామ సంఘం సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కొరకు తనవంతు కృషి చేస్తానని lఅన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News