Homeసాహిత్యంInspiration | జీవితం మళ్లీ మళ్ళీ రాదు… !

Inspiration | జీవితం మళ్లీ మళ్ళీ రాదు… !

జీవితం మళ్లీ మళ్ళీ రాదు
ఉన్నప్పుడే ఆసాంతం జీవించు !
ప్రియ నేస్తాలు మళ్లీ మళ్ళీ దొరకరు
అందినపుడే ఆస్వాదించు !
ప్రేమించే హృదయం రోజూ దొరకదు
దొరికినప్పుడే గట్టిగా ఆలింగనం చేసుకో !
వయస్సు మళ్ళీ మళ్లీ తిరిగి రాదు
ఉన్నపుడే అన్నింటినీ అందిపుచ్చుకో !
గడిచిన క్షణం మళ్లీ మళ్లీ రానే రాదు
వర్తమానాన్ని సద్వినియోగం చేసుకో !
పెదవి జీరిన మాట వెనక్కి రాదు
పెదవి దాటక ముందే అదుపు చేసుకో !

- Advertisement -
RELATED ARTICLES

Latest News