Homeనల్లగొండPM SHRI Scheme | ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

PM SHRI Scheme | ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

మఠంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు బోధించేందుకు పీఎం శ్రీ పథకం (PM SHRI Scheme) కింద స్పెషల్‌ ఎడ్యుకేటర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాల ప్రిన్సిపాల్ బి శంకర్ నాయక్ శుక్రవారం తెలిపారు.

దరఖాస్తులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభయ్యాయని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. తాత్కాలిక ప్రాతిపదికన నవంబర్ 2026 నుండి మార్చి 2027 వరకు ఐదు నెలల కాలానికి సంబంధించి ఎంపికైన స్పెషల్‌ ఎడ్యుకేటర్లకు నెలకు రూ.16,500 వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించారు.నియామకానికి సంబంధించి స్పెషల్ బీఇడీ విద్యా అర్హతగా ఉండాలని,దరఖాస్తు విధానం తదితర పూర్తి సమాచారాన్ని మోడల్ పాఠశాలకు వచ్చి తనను సంప్రదించి తెలుసుకోవాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News