- నంబర్ వన్ మున్సిపల్ గా అబివృద్ది చేస్తాం:- చైర్మన్ శిరీష రెడ్డి
అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 5వ వార్డులో మున్సిపల్ జనరల్ నిధుల నుంచి రూ.6 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులను గురువారం ఉదయం 10 గంటలకు పురపాలక సంఘం చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే పురపాలక సంఘం ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ శ్రీమతి కన్రెడ్డి మాలతి మాధవరెడ్డి, కౌన్సిలర్లు తల్లా స్వప్న రాంప్రసాద్, తలారి మౌనిక బాబు, కైరా గణేష్, మున్సిపల్ ఏఈఈ శ్రీమతి సనా షాహీన్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -
