- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
- ప్లాస్టిక్ నిర్మూలన విషయంలో ఎండ్రియల్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్.
ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తిగా నిర్మించాల్సిన అవసరం ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.ఆయన గురువారం తాడ్వాయి మండలంలోని ఏండ్రియల్ గ్రామంలో జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏండ్రి యల్ గ్రామాన్ని జిల్లాలో మిగతా గ్రామాల ఆదర్శంగా తీసుకొని ప్లాస్టిక్ నిర్మూలన కోసం కృషి చేయాలన్నారు. ఏండ్రియల్ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించడం చర్యలు చేపట్టడం అభినందననియమన్నారు.


పాలకవర్గం విన్నుత ఆలోచనతో మొదట ఈ గ్రామంలో కేజీ ప్లాస్టిక్ తెచ్చిన వారికి ఒక స్టీలు టిఫిన్ బాక్స్ ఇవ్వడం ప్రారంభించడమన్నారు. దింతో గ్రామంలో అందరూ తమ ఇండ్లలలో చెత్తను ప్లాస్టిక్ గ్రామపంచాయతీకి ఇవ్వడం ప్రారంభించారు. తద్వారా గ్రామంలో అందరూ కూడా ప్లాస్టిక్లు నిషేధించడం ప్రారంభించారు. ఫంక్షన్ లో సైతం, ప్లాస్టిక్ ప్లేట్ల బదులుగా స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాస్ వాడడం సంతోషించేదగ్గ విషయం అన్నారు.
ఇదే ఆలోచనతో తాను జిల్లాలో ఐదు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్లాస్టిక్ దాన్ని అమలు చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో కూడా దీన్ని అమలుపరుస్తామన్నారు ఇందుకు ప్రజలు సహకరించాలని ప్లాస్టిక్ మహమ్మారి భవిష్యత్ తరాలకు పెద్ద శాపంగా మారబోతుందని ప్లాస్టిక్ పర్యావరణంతో కలిసి పోవడానికి కొన్ని వందల సంవత్సరాల పడుతుందని సముద్రంలో కూడా ప్లాస్టిక్ వ్యర్థల వల్ల చాలా జంతువులు తన ఉనికిని కోల్పోతున్నాయన్నారు.


ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్లాస్టిక్ ప్లేట్ల, గ్లాసులకు బదులుగా స్టీల్ ప్లేట్లు వాడాలని ప్లాస్టిక్ గ్లాసులు, గ్లాసులు వాడాలన్నారు. ప్రజలను ప్రోత్సహించేందుకు మేము జ్యూట్ బ్యాగులు ప్రోత్సాహం కింద పంపిణీ చేయడానికి ఏర్పాటు చేశామనన్నారు. అనంతరం ప్లాస్టిక్ నిర్మూలన కోసం సహకరించిన దాతలకు గ్రామ సర్పంచి, పాలకవర్గానికి, ప్రోత్సాహకంగా సన్మానాలు చేశారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఇంకుడు గుంతలు ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జలసిరి పథకం కింద ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ముందుకు ప్రభుత్వం 6,500 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గిరి,డిఆర్డిఓ దామోదర్, డిఎంహెచ్వో వెంకటి, ఎంపీడీవో భరత్ ఎమ్మార్వో శ్వేత, గ్రామ సర్పంచ్ కొన్ని నర్సిములు,ఉపసర్పంచ్ నర్సారెడ్డి, పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు
