Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | 'స్కిల్ డెవలప్మెంట్' కాదు.. 'స్కామ్ డెవలప్మెంట్'?

Aaj Ki Baath | ‘స్కిల్ డెవలప్మెంట్’ కాదు.. ‘స్కామ్ డెవలప్మెంట్’?

సదువొచ్చిందేమో గానీ..
సక్కని కొలువులు రాకపోయే..
ఇగ ‘స్కిల్’ పేరుతో స్కీములు
పుట్టుకొచ్చినై.. ఏజెన్సీల ఒర్రుడు,
లీడర్ల జేబుల గలగళ తప్ప
నిరుద్యోగి బతుకు మాత్రం ఎక్కడి గొంగళి
అక్కడే అన్నట్టుంది..
లెక్కల మీద దొంగ హాజర్లు,
రికార్డుల మీద డొల్ల మార్కులు..
చివరకు స్కిల్ డెవలప్మెంట్
అంటేనే నిరుద్యోగి ఆశలకు సమాధి కట్టే
‘స్కామ్ డెవలప్మెంట్’ అయిపాయే..
నాయకుల జేబులు నిండబట్టే..
సెంటర్ల నిర్వాహకులకు లాభాలు రాబట్టే..
నిరుద్యోగి జీవితం మాత్రం ఆగమాగమాయబట్టే..
ప్రభుత్వ ఖజానాకు పెద్ద బొక్క పడబట్టే..

- Advertisement -
RELATED ARTICLES

Latest News