సూర్యాపేట జిల్లా మట్టపల్లి క్షేత్రంలో శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కల్యాణ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు సుప్రభాత సేవ,నిత్య హోమం,గర్భాలయంలోని మూల విరాట్ కు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్య కళ్యాణం జరిపి శ్రీ స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.
అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానీవేదన గావించి 110 మంది భక్తులకు అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో టీ.వెంకట చలపతి,అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, విజయ్ కుమార్,ఆలయ అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు,పద్మనాభాచార్యులు, లక్ష్మీ నరసింహ మూర్తి,ఆంజనేయచార్యులు,ఆలయ సిబ్బంది,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
