- డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సానబోయిన ఉపేందర్
నీట్ పేపర్ లీకేజీ లకు బాధిత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సానబోయిన ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలను బంద్ చే యించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనల పై పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుపట్టారు.
చలో పార్లమెంట్ మర్చ్ లో విద్యార్థులపై పోలీసుల లాటి ఛార్జ్ చేస్తూ దేశద్రోహుల కంటే, ఉగ్రవాదుల కంటే ఎక్కువగా వారిని హింసిస్తూ వారిపై చేసిన దమనకాండను నిరసిస్తూ. తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ని ర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, కక్షపూరితంగా విద్యార్థులపై దాడులు నిర్వహించడం సమంజసం కాదని అన్నారు.
న్యాయమైన విద్యార్థుల డిమాండ్లను అంగీకరించి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు వేల్పుల ఉత్తేజ్, నాయకులు తండు పవన్, రేసు నవీన్, ఐతరాజు అశోక్, మడ్డి ఆకాశ్, గుండు అభి, నార్ల వేణు, పూడూరి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
