Homeఆదాబ్ ప్రత్యేకంLand Scam | పేదల భూములపై భూ బకాసురుల పంజా..

Land Scam | పేదల భూములపై భూ బకాసురుల పంజా..

  • రంగారెడ్డి జిల్లాలో నిగ్గుతేలిన దారుణ భూ కుంభకోణం!
  • సర్వే నంబర్ 24లో 57 ఎకరాలఅసైన్డ్ భూముల కుంభకోణం
  • అక్రమంగా ప్రైవేటు పట్టాలు సృష్టించారన్న విమర్శలు
  • రికార్డుల్లో లేని 5 ఎకరాలపై అనుమానాలు
  • రైతులను బెదిరించి భూములు కాజేశారన్న ఆరోపణ
  • రెవెన్యూ అధికారుల పాత్రపై విచారణకు డిమాండ్
  • అక్రమ పట్టాలు రద్దు చేయాలని బాధితుల విజ్ఞప్తి
  • కోట్లు వెనకేసుకుంటున్న కొందరు రెవెన్యూ ఆఫీసర్స్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, శంకరాపూర్ గ్రామంలో భూ బకాసురుల అన్యాయాలు, అక్రమాలు హద్దులు దాటేశాయి! సర్వే నంబర్ 24 పరిధిలోని సుమారు 57 ఎకరాల కేటాయించిన (అసైన్డ్) భూమిపై కన్నువేసిన భూ మాఫియా.. చట్టాలను, నైతికతను నిలువునా పూడ్చిపెట్టి కోట్లాది రూపాయల భూమిని దర్జాగా కొల్లగొడుతోంది. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా..

ప్రభుత్వ భూములను, పేదల హక్కులను అక్రమంగా “పట్టాలు”గా మార్చేస్తూ అక్రమార్కులు సాగిస్తున్న ఈ దందా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అమాయక రైతులను బెదిరించి, బడా నేతలు, ఉన్నతాధికారుల అండదండలతో వేల కోట్ల విలువైన సొత్తును దోచుకుంటున్నా అధికారులు కనీసం కన్నుతెరిచి చూడకపోవడం వ్యవస్థాగత కుళ్లుపోకడకు పరాకాష్ట!

- Advertisement -
Shankarapur assigned land scam allegations01 1

పేదల ఆత్మగౌరవాన్ని ‘పట్టా’ చేసి అమ్మేస్తారా?..

ప్రభుత్వం నిరుపేదలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భూములను కేటాయించింది వారు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే! కానీ, నేడు ఆ నిబంధనలన్నీ అక్రమార్కుల స్వార్థానికి బలైపోతున్నాయి. పేదవాడి కడుపు కొట్టి, వారి జీవనాధారాన్ని తెంచి.. ప్రభుత్వ కేటాయింపు భూములను దొంగ రికార్డులతో ప్రైవేటు వ్యక్తుల పేర్లకు, బడా వ్యాపారుల హక్కులుగా మారుస్తున్న తీరు దారుణం. పేదల పొట్టకొట్టి తమ ఖజానాలు నింపుకుంటున్న ఈ ‘భూ రాబందుల’ అక్రమాలకు అడ్డుకట్ట వేసేనాథుడే కరువయ్యాడు.

హఠాత్తుగా ప్రత్యక్షమైన 5 ఎకరాలు! :

అజయ్ కుమార్ అగర్వాల్ లాంటి వ్యక్తులు వెనుకుండి చక్రం తిప్పుతూ, సర్వే నంబర్ 24లోని దాదాపు 8 ఎకరాలకు పైగా ఉన్న కేటాయించిన భూమిని దొడ్డిదారిన తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇట్టి భూములు బదిలీ చేసుకోవడానికి పక్కా ప్రణాళికతో అధికారులతో ములాఖత్ పూర్తి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. అమాయక రైతులను నామమాత్రపు ధరలతో వంచించి, బెదిరింపులకు గురిచేస్తూ భూముల నుంచి తరిమేస్తున్నారు.

అంతటితో ఆగక, ఈ భూములను సర్వే చేసిన సమయంలో రికార్డుల్లో లేని మరొక 5 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. రికార్డుల్లో లేని భూమి ఎవరి ఖాతాలో ప్రత్యక్షమైందో తేలాల్సి ఉంది. కేటాయించిన భూమిని ప్రైవేటు పట్టాగా మార్చడంలో జరిగిన ‘మ్యాజిక’ ఏంటి? ఈ దొంగ రికార్డుల సృష్టికర్తలు ఎవరు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులపై సమగ్ర విచారణ జరిపి నడిరోడ్డుపై నిలబెట్టాలని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

Shankarapur assigned land scam allegations1

రెవెన్యూ లీలలు.. ఉన్నతాధికారులే
అక్రమాలకు సూత్రధారులా?..

ఈ దారుణ అక్రమాల వెనుక కేవలం స్థానిక అధికారులు మాత్రమే కాదు.. అప్పటి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సి.సి.ఎల్.ఎ) స్థాయి ఉన్నతాధికారుల కనుసన్నలు కూడా ఉన్నా యనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే, అక్రమార్కులు అప్పనంగా విసిరే నోట్లకట్టలకు ఆశపడి రికార్డులను తారుమారు చేయడం క్షమించరాని నేరం.

బాధితుల డిమాండ్..

కేటాయించిన భూములను అక్రమంగా ప్రైవేటు పట్టాలుగా మార్చి, స్వార్థ ప్రయోజనాలకు తెగబడిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి అడ్డాగా మారిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా, వారిపై నేరపూరిత కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి!

బదిలీ నిషేధ చట్టం (పి.ఓ.టి. చట్టం-1977) ఏమైంది?..

కేటాయించిన భూమిని కొనడం, అమ్మడం లేదా ఇతరుల పేరిట పట్టా మార్పిడి చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. అయినా సరే, ఈ చట్టాన్ని బుట్ట దాఖలు చేసి దర్జాగా పట్టాలు ఎలా మారుస్తున్నారు?

వారసత్వ హక్కుల కాలరాపత..

కేటాయించిన భూములపై కేవలం చట్ట బద్ధమైన వారసులకు మాత్రమే హక్కు ఉంటుంది. కనీసం మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా లేకుండా, మూడో వ్యక్తి పేరు మీద పట్టాలు సృష్టించడం పక్కా రికార్డుల ఫోర్జరీ కాదా?

నేరపూరిత కేసులు ఏవి?..

అధికార దుర్వినియోగానికి పాల్పడి రికార్డులను తారుమారు చేసిన అధికారులు, సహకరించిన వ్యక్తులు భారత శిక్షా స్మృతి ప్రకారం తీవ్రమైన నేరస్థులు. వారిపై చట్టపరమైన విచారణ జరిపాల్సిందే!

పీఠాలు కదలాల్సిందే.. లేదంటే సమరమే!..

శంకరాపూర్ భూ బాధితుల ఆవేదనను చూస్తుంటే, అధికారం, డబ్బు ఉంటే చట్టాన్ని కూడా కొనేయవచ్చనే అహంకారం అక్రమా ర్కుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్న తాధికారులు నిద్రమత్తువదిలి తక్షణమే స్పందించాలి. రాత్రికిరాత్రే వెలిసిన ఆ 5ఎకరాల ‘దొంగ పట్టాల’ వెనుక ఉన్న బాగో తాన్ని బయటపెట్టాలి. అక్రమ పట్టాలు సృష్టించిన అవినీతి అధి కారుల పీఠాలు కదిలించి, పేదలకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ భూ పోరాటం ఉధృత రూపం దాల్చడం ఖాయం!

- Advertisement -
RELATED ARTICLES

Latest News