HomeజాతీయంNaresh Pal Gangwar | విద్యాశాఖలో భారీ మార్పులు..

Naresh Pal Gangwar | విద్యాశాఖలో భారీ మార్పులు..

  • కొత్త విద్యా కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్.

విద్యాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యా కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్‌ను నియమించింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించిన వినీత్ జోషి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యా రంగంలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లక్ష్యంగా కేంద్రం ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్త కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యా విధానాలు, సంస్కరణల అమలులో వేగం పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News