Homeఆదిలాబాద్Municipal Sanitation | మున్సిపాలిటీలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

Municipal Sanitation | మున్సిపాలిటీలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, కలెక్టర్ మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని అన్నారు. వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ లు రవి బాబు, సుందర్ సింగ్, యాదయ్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News