Homeఆదిలాబాద్SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి

SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి

  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి.

ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో వెనుకబడి ఉన్న జిల్లాలలో ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జిల్లాల వారిగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రగతి వివరాలు సమీక్షించారు. వారంలోగా అన్ని జిల్లాల ఎస్ఐఆర్ ప్రక్రియ 90 శాతానికి చేరుకోవాలని, వీలైనంత త్వరగా ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారములో ఆధార్ నంబరు నమోదు చేయడం కేవలం ఐచ్చిక మాత్రమే అని, తప్పనిసరి కాదని వివరించారు. కలెక్టర్లంతా ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు.

- Advertisement -

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఈ వీసీలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News