- వివాహేతర సంబంధాల కారణంగా పెరుగుతున్న ఘోరాలు
దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 785 మంది భర్తలు తమ భార్యల చేతిలో చనిపోయారు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకుని, అడ్డొస్తున్న భర్తలను ప్రియుళ్లతో కలిసి దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఘటనల తీవ్రత గత కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని ఘోరమైన సంఘటనలలో మీరట్ డ్రమ్ హత్య, ఒకటి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సౌరభ్ రాజ్పుత్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్తో కలిసి హత్య చేసి, శరీరాన్ని 15 ముక్కలుగా నరికి సిమెంట్ నింపిన డ్రమ్లో దాచిపెట్టింది.

అదేవిధంగా మరో కోణంలో కూడా ఉత్తరప్రదేశ్లోని ఔరయ్య జిల్లాలో వివాహం అయిన 15 రోజులకే ఓ నవ వధువు ప్రగతి, భర్త దిలీప్ యాదవ్ను ప్రియుడు అనురాగ్తో కలిసి హత్య చేయించింది. ఇది ఇలా ఉండగా మరోవైపు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మనూర్ మండలానికి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని, భర్త ముత్యంరెడ్డిని ప్రియుడితో కలిసి హత్య చేసి, జేసీబీతో గొయ్యి తవ్వించి పాతిపెట్టింది. అలాగే మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కుమార్ను అతని భార్య భారతి, తన ప్రియుడు సురేందర్తో కలిసి హతమార్చింది. ఈ నేర గణాంకాల ప్రకారం, ఐదు రాష్ట్రాల్లో భార్యలు తమ భర్తలను చంపిన కేసులు 785 నమోదయ్యాయి,
అందులో
2020: 45 కేసులు
2021: 52 కేసులు
2022: 60 కేసులు
2023: 55 కేసులు
2024: 62 కేసులు
(అత్యధికం) ఇవన్నీ వివాహేతర సంబంధానికి దారి తీసిన హత్యలే కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అనే కోణంలో ఆరాధిస్తే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా పరిచయాలు ఏర్పడి, అవి వివాహేతర సంబంధాలుగా మారుతున్నాయి.
క్షణిక సుఖం కోసం, పచ్చని సంసారాల్లో చిచ్చు రేపేలా క్షణిక సుఖం కోసం ఏర్పడే సంబంధాలు అమాయకుల ప్రాణాలను హరించేస్తున్నాయి. సోషల్ ప్లాట్ ఫామ్ ల వల్ల రోజంతా వాటిపై టైం కేటాయించడంతో భార్య-భర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకం, కుటుంబ బంధాలు దెబ్బతింటున్నాయి.

సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ఏర్పడటం మొబైల్ ఫోన్ల ద్వారా రహస్య సంబంధాలు కొనసాగించడం ఇంటి నుంచే బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడంలో సులభం కావడం పై ప్రభావం పడటం ద్వారా ఈ ఘటనలు కుటుంబ వ్యవస్థ, దాంపత్య జీవితాల విలువలపై ప్రజల్లో అనేక అనుమానాలను రేపుతున్నాయి. భర్త తన తప్పు లేకపోయినా బలైపోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా గత మూడు రోజుల్లో వరుసగా భర్తల హత్యలు చోటుచేసుకోవడం పై దేశవ్యాప్తంగా కలవరపెడుతోంది.
వరుసగా జరుగుతున్న ఈ ఘటనల పై పోలీసులు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి హత్యలు కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా భర్తల హత్యలు పెరగడం సమాజంలో కలవరాన్ని రేపుతోంది. అంటూ ఇటువంటి ఘటనలను నివారించడానికి కుటుంబ విలువలు, నైతిక విలువలను పాటించడం, సామాజిక అవగాహన పెంచుకోవడం అత్యవసరం.అని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.
