ఇంజాపూర్ విలేజ్ లోని దిల్వార్ ఖాన్ చెరువు ఎఫ్ టీ ఎల్ పరిధి, సర్వే నెంబర్ 126 గవర్నమెంట్ భూమిలో అక్రమంగా వెలిసిన కట్టడాలను ఆర్ ఐ ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి కూల్చివేశారు. చెరువు పరిరక్షణలో భాగంగా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
- Advertisement -
