Homeఆదాబ్ ప్రత్యేకంMedchal | అక్రమ నిర్మాణాలకు అడ్డులేదు..!

Medchal | అక్రమ నిర్మాణాలకు అడ్డులేదు..!

  • ఇష్టానుసారంగా కమర్షియల్ షెటర్ల నిర్మాణాలు..
  • టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై విమర్శలు..
  • ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు ఆరోపణలు..

మేడ్చల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి గిర్మాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండానే కమర్షియల్ షెటర్ల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుం డటంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఇటీవల మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పాత జిల్లా పరిషత్ కార్యాలయ భవనానికి మార్చడంతో ఆ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈఅవకాశాన్ని కొందరు ఆసరాగా చేసుకుని వాణిజ్య సముదాయాలు, కమర్షియల్ షెటర్ల నిర్మాణా లను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణాలకు అవసరమైన అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, ఇతర నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Medchal illegal commercial constructions allegations1

సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, న్యాయ సేవలకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అధిక డిమాండ్ ఏర్పడింది. దీంతో కొందరు వ్యాపారులు రాత్రికి రాత్రే కమర్షియల్ షెటర్ల నిర్మాణాలు చేపడుతూ భారీ మొత్తాలకు అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారని సమాచారం. ఒక్కో షెటర్ కోసం లక్షల రూపాయల అడ్వాన్స్‌లు చెల్లించి దక్కించు కునేందుకు పోటీ నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మొన్నటి వరకు నిర్మానుష్యంగా కనిపించిన ఈ రహదారి ప్రస్తుతం పూర్తిగా వాణిజ్య కేంద్రంగా మారుతోంది. అయితే ఈ నిర్మాణాలన్నీ నిబంధనల మేరకే జరుగుతున్నాయా, లేక అక్రమంగా కొనసాగుతున్నాయా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణాలు పెరిగితే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బం దులు, ప్రజలకు అసౌకర్యాలు తలెత్తే అవకాశముందని పలువురు అభిప్రా యపడుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాల కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఫీజులు, అనుమతి రుసుములు, అభివృద్ధి ఛార్జీలు వసూలు కాక ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు పేర్కొంటు న్నారు.

Medchal illegal commercial constructions allegations2

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టడంలేదనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికైనా జీహెచఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పం దించి, అనుమతులు లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచా రణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై కఠిన చర్యలు తీసు కోవాలని స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే అరికడితేనే భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలకు చెక్ పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News