Homeఆదిలాబాద్Nirmal SP | నిర్మల్ పోలీస్… మీ పోలీస్

Nirmal SP | నిర్మల్ పోలీస్… మీ పోలీస్

  • సోన్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్

నిర్మల్ జిల్లా సోన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల,ఐపీఎస్ ఈరోజు వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా మొదటగా పోలీసు సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను ఎస్పీ పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.తదుపరి పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసు ఫైళ్లు, స్టేషన్ రిజిస్టర్లు, మాల్ఖానా, ఆయుధాగారం, లాకప్, సీసీటీఎన్‌ఎస్ (CCTNS) నిర్వహణ, ఇతర పరిపాలనా అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

అలాగే ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా స్టేషన్ రైటర్లు, సీసీటీఎన్‌ఎస్ సిబ్బంది పనితీరును జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తున్న తీరుపై ప్రశంసలు వ్యక్తం చేశారు.

ఈ వార్షిక తనిఖీలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల,ఐపీఎస్ తో పాటు, నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్,సోన్ సర్కిల్ ఇన్సెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై లు గోపి,హనుమాన్లు, శ్రావణి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News