Saturday, July 4, 2026
Homeఆరోగ్యంMental Health | మైండ్ కు రెస్ట్ ఇవ్వండి..

Mental Health | మైండ్ కు రెస్ట్ ఇవ్వండి..

  • మానసిక ప్రశాంతత లభిస్తుంది..
  • సలహాలిస్తున్న నిపుణులు..

రోజంతా పని చేసి, చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాక కూడా మనసుకు ప్రశాంతత ల‌భ్య‌మ‌వ‌కుండా మరో పని వెతుక్కోవాలనిపిస్తుందా? ఖాళీగా కూర్చుంటే ఏదో తప్పు చేస్తున్నట్టుగా, సమయాన్ని వృథా చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న ఈ భావన వెనుక మెదడు పనిచేసే విధానం, జీవనశైలి, ఉత్పాదకతపై ఏర్పడిన అభిప్రాయాలు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఒక పని పూర్తి చేసిన ప్రతిసారీ మెదడు డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది.

ఇది సంతృప్తి, ప్రేరణ, విజయ భావనను కలిగిస్తుంది. టు-డూ లిస్ట్‌లో ఒక పని పూర్తయిందని గుర్తు పెట్టడం, ఈ-మెయిల్స్‌కు సమాధానం ఇవ్వడం, లక్ష్యాన్ని చేరుకోవడం వంటి ప్రతి చిన్న విజయంతో ఈ డోపమైన్ విడుదల అవుతుంది. దీంతో మెదడు మళ్లీ మళ్లీ అదే అనుభూతిని కోరుకోవడం ప్రారంభిస్తుంది. క్రమంగా ఎప్పుడూ బిజీగా ఉండటమే సహజంగా అనిపిస్తుంది. ఈ అలవాటు పెరిగే కొద్దీ చాలామంది తమ విలువను తాము చేసే పనితో ముడిపెట్టుకుంటారు.

- Advertisement -

విరామం లేకుండా పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరగడం కాకుండా, శక్తి తగ్గి పనితీరు మరింత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడు రోజంతా అత్యధిక సామర్థ్యంతో నిరంతరం పనిచేసేలా నిర్మాణం కాలేద‌ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మెదడుకూ అంతే అవసరం.

అందువల్ల విశ్రాంతిని పనికి ఇచ్చే బహుమతిగా కాకుండా, శరీరం-మెదడుకు అవసరమైన సహజ ప్రక్రియగా చూడాలని సూచిస్తున్నారు. నడకకు వెళ్లడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పుస్తకం చదవడం లేదా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం వంటివి సమయ వృథా కాదు. ఇవి మెదడుకు తిరిగి శక్తిని అందించి, ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News