Sunday, June 28, 2026
HomeఫోటోలుLaunch | మీరా ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీ ప్రారంభం

Launch | మీరా ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీ ప్రారంభం

మీరా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మౌర్య సిద్ధ‌వ‌రం, త‌న్వి ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా..అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత సందీప్ రామినేని(శాండి) మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీగా రాబోతోన్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్  గీత సి.శేఖ‌ర్‌   ఫ‌న్‌ ఎంట‌ర్‌టైనింగ్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తూనే ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. మౌర్య‌, త‌న్వి జోడీ క్యూట్‌గా మెప్పించ‌నున్నారు. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

- Advertisement -

న‌టీన‌టులు:

మౌర్య సిద్ధ‌వ‌రం, త‌న్వి ఆకాంక్ష త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్:  మీరా ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌:  సందీప్ రామినేని (శాండి)
ద‌ర్శ‌క‌త్వం:  గీత సి.శేఖ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ:  సురేష్ ర‌గుతు

- Advertisement -
RELATED ARTICLES

Latest News