Saturday, June 27, 2026
HomeసినిమాSoldier | "సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ" మూవీ ఫస్ట్ లుక్

Soldier | “సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ” మూవీ ఫస్ట్ లుక్

కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ “సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కొనంకి కార్తీక్ శక్తివంతమైన సైనికుడి పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. యుద్ధ వాతావరణం, పోరాట ఛాయలు, గర్వంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకం మధ్య ఆయన లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

“24×7 ఆన్ డ్యూటీ” అనే  ట్యాగ్‌లైన్‌తో దేశ సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహిస్తూ దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేసే భారత సైనికులకు ఈ చిత్రం ఘన నివాళిగా నిలవనుంది. ఈ చిత్రంలో కొనంకి కార్తీక్ మరియు ప్రియాంక వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని  శ్రద్ధ ఖత్రి దర్శకత్వం వహిస్తున్నారు. కె. వి. నాయుడు కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి, మానవీయ విలువల సమ్మేళనంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.

- Advertisement -

సాంకేతిక నిపుణులు:

ప్రొడక్షన్ హౌస్: కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్
రచన & దర్శకత్వం: శ్రద్ధ ఖత్రి
నిర్మాత: కె. వి. నాయుడు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సందీప్ బద్దుల
లైన్ ప్రొడ్యూసర్: నవీన్ వడ్త్యావత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తొకల వెంకట కిషోర్
సీఈఓ: పి. జగదీష్
పీఆర్‌ఓ: తేజస్వి సజ్జ

- Advertisement -
RELATED ARTICLES

Latest News