Saturday, June 27, 2026
Homeఆంధ్రప్రదేశ్Chandrababu | వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తా..

Chandrababu | వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తా..

  • జాతికి నేనే అంకితం చేస్తా..
  • హామీ ఇచ్చిన చంద్రబాబు..

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, ఇప్పుడు దానిని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా తనపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే గత పాలకులు కేవలం ప్రారంభోత్సవం చేసి చేతులు దులుపుకొన్నారని ఆయన విమర్శించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టి పల్లె (కె.ఎస్ పల్లె)లో శనివారం జరిగిన ‘సంజీవని’ కార్యక్రమ ప్రారంభోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు అనేది మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు జీవనాడి వంటిదని, దానిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.3,900 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉందని చంద్రబాబు వివరించారు. పునరావాసం కింద నిర్వాసితులకు ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని, త్వరలోనే మరో రూ.600 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో 1.19 లక్షల ఎకరాలకు, ఆ తర్వాత మిగిలిన ప్రాంతానికి పరిహారం చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. కొందరు గొడ్డలి పార్టీకి పరోక్షంగా పనిచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News