- సౌదీ అరేబియాతో మ్యాచ్ డ్రా చేసుకున్న కాబో..
- టోర్నీలో అరంగేట్రం చేసిన అతి చిన్న దేశంగా రికార్డు..
ఆఫ్రికా దేశం కాబో వెర్డే సంచలనం నమోదు చేసింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్ స్టేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌదీ అరేబియాతో హూస్టన్‌లో జరిగిన మ్యాచ్‌ను కాబో వెర్డే డ్రా చేసుకున్నది. దీంతో గ్రూప్ హెచ్‌లో మూడు పాయింట్లతో ఆ దేశం రెండో స్థానంలో నిలిచింది. ఆ గ్రూపు నుంచి స్పెయిన్ కూడా నాకౌట్‌కు వెళ్లింది. అయితే ఈ వరల్డ్‌కప్‌లో కాబో వెర్డే సంచలనం నమోదు చేసింది. టోర్నీలో అరంగ్రేటం చేసిన అతిచిన్న దేశంగా కాబో వెర్డే నిలిచింది. అయితే అరంగేట్రం చేసిన టోర్నీలోనే నాకౌట్‌కు వెళ్లిన జట్టుగా కూడా కాబో వెర్డే రికార్డు క్రియేట్ చేసింది. నాకౌట్ స్టేజ్‌లో అర్జెంటీనాతో కాబో వెర్డే పోటీపడనున్నది.
ఇక తన గ్రూప్ మ్యాచుల్లో స్పెయిన్, ఉరుగ్వే లాంటి జట్లను కూడా కాబో వెర్డే ధీటుగా ఎదుర్కొన్నది. ఈ టోర్నీలో ద్వీప దేశం కాబో వెర్డే తన ప్రదర్శనతో అందర్నీ స్టన్ చేసింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నాకౌట్‌లోకి కాబో ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. గతంలో 2002లో సెనిగల్ దేశం కూడా గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నాకౌట్ దశకు వెళ్లింది. ఈ టోర్నీలో చాలా నిలకడగా కాబో వెర్డే ఆడింది. అన్ని మ్యాచ్‌లను డ్రా చేసుకున్నది. మియామిలో జూలై 3వ తేదీన మెస్సీ టీమ్‌తో కాబో వెర్డే పోటీపడనున్నది.
