Saturday, June 20, 2026
Homeఆంధ్రప్రదేశ్భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి జన్మదిన శుభాకాంక్షలు..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి జన్మదిన శుభాకాంక్షలు..

  • శుభాకాంక్షలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేష్..

భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఆమె సాగించిన అసాధారణ ప్రయాణం, ప్రజాప్రతినిధిగా ఆమెకున్న అంకితభావం, దేశం పట్ల ఆమె చూపుతున్న నిబద్ధత కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఒక సాధారణ నేపథ్యం నుండి దేశ అత్యున్నత పదవిని అధిష్టించిన ఆమె ప్రస్థానం మహిళా శక్తికి, పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యం. ప్రజల సంక్షేమం కోసం ఆమె చేస్తున్న కృషి అమోఘం. ముర్ము గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశానికి మరిన్ని సేవలందించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News