Saturday, June 27, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | భారత పౌరుడినని పదేపదే నిరూపించుకోవాలా?

Aaj Ki Baath | భారత పౌరుడినని పదేపదే నిరూపించుకోవాలా?

ఒక దేశంలో పుట్టడం ఒక వాస్తవం… కానీ ఆ దేశ పౌరుడిననే విషయాన్ని జీవితాంతం నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టం..
ఒక ప్రజాస్వామ్యంలో పౌరుడికి తన హక్కులపై, తన గుర్తింపుపై నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మరింత బలపరిచే విధంగా, పారదర్శకమైన, శాశ్వత పరిష్కారాలపై పాలకులు, న్యాయ నిపుణులు, మేధావులు, ప్రజాప్రతినిధులు కలిసి ఆలోచించాల్సిన సమయం ఇది. నేను భారతీయుడిని అని పదేపదే నిరూపించుకోవాల్సిన అవసరం కాకుండా, నేను భారత పౌరుడిని అనే నమ్మకం ప్రతి పౌరుడికి శాశ్వత హామీగా నిలిచే వ్యవస్థే నిజమైన ప్రజాస్వామ్య బలం..

  • బీవీఆర్ రావు
- Advertisement -
RELATED ARTICLES

Latest News