- జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలి..
మనం తినే ఆహారంలో ఐరన్ ఎంత ఉందనేదాని కన్నా, ఆ ఐరన్‌ను మన శరీరం ఏ మేరకు లోపలికి గ్రహిస్తున్నది అనేదే ముఖ్యం. ఎంత మంచి ఆహారం తీసుకున్నా శోషణ సరిగా లేకపోతే ప్రయోజనం శూన్యం. ఈ సమస్యకు చెక్ పెడుతూ, శరీరంలో ఐరన్ శోషణను వేగవంతం చేసి హిమోగ్లోబిన్‌ను పెంచే ఆ చిట్కాలేమిటో తెలుసుకుందాం.. ఐరన్‌ను శరీరం పూర్తిగా గ్రహించాలంటే మన జీర్ణక్రియ అద్భుతంగా ఉండాలి.
ముఖ్యంగా జీర్ణాశయంలో ఉండే స్టమక్ యాసిడ్ పరిమాణం సరిగ్గా ఉండటం ముఖ్యం. అప్పుడే మనం తినే ఆహారం బాగా జీర్ణమై అందులోని పోషకాలు అందుతాయి. అందుకోసం ఒక చిన్న అల్లం ముకను నిమ్మరసంలో అరగంట పాటు నానబెట్టాలి. భోజనం చేయడానికి సరిగ్గా పది నిమిషాల ముందు ఆ అల్లం ముకను బాగా నమిలి తినాలి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- Advertisement -
