- ఈనెల 10వ తేదీన నిత్యవసర వస్తువులను తగ్గించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
- కరపత్రం విడుదల చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ
ఈనెల 10వ తేదీన పెంచిన నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండని పిలుపునిచ్చారు.. సిపిఐ రాష్ట్ర నాయకులు.యాదగిరిగుట్ట పట్టణంలో పెంచిన నిత్యవసర వస్తువులు డీజిల్ పెట్రోలు, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ..
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర ధరలను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని, బిజెపి పాలనలో సామాన్యుడు బతుకుబారంగా మారిందని డీజిల్,పెట్రోలు వంట గ్యాసు, పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని అచ్చేదిన్ వస్తాయని చెప్పి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జేబుకు చెల్లులు పెడుతున్నారు.
కార్పొరేటు సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న బిజెపి ప్రభుత్వం సామాన్యులపై మాత్రం పన్నుల భారం వేస్తూ ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని ఆదాయాలు పెరగడం లేదు కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయని దేశంలో పేదరికం నిరుద్యోగం పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ధరల పెరుగుదలతో సామాన్యుడిని లోడ్ చేస్తున్న బిజెపి పాలన నశించాలని అడ్డు అదుపు లేని ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్ సిపిఐ మండల కార్యదర్శి కలపెల్లి మహేందర్ సిపిఐ పట్టణ కార్యదర్శి బబ్బురి శ్రీధర్ సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన పెంటయ్య సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి పేరబోయిన బంగారి గీతా పనివాళ్ల సంఘం మండల కార్యదర్శి గుండు వెంకటేష్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి గోపగాని రాజు సిపిఐ నాయకులు పబ్బల స్వామి,బొమ్మిడి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
