HomeతెలంగాణPonnam Prabhakar | అప్రజాస్వామిక విధానాలపై సాధించిన గొప్ప విజయం..

Ponnam Prabhakar | అప్రజాస్వామిక విధానాలపై సాధించిన గొప్ప విజయం..

  • ఆనందం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..
  • కేంద్రంపై ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని వ్యాఖ్య

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు, ఉద్యమకారుల విజయమని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇది అప్రజాస్వామిక విధానాలపై సాధించిన గొప్ప గెలుపని ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీ పోరాటం, దేశవ్యాప్తంగా విద్యార్థులు చూపిన ఐక్యత వల్ల కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దనే బలమైన గుణపాఠం కేంద్రానికి దక్కిందని స్పష్టం చేశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే మొదటి మెట్టు అని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. విద్యార్థుల నిరసనలను అణచివేసేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేసి, మెట్రో సేవలు బంద్ చేసి, లాఠీ ఛార్జీలు జరిపినా వెరవకుండా వేలాది మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొనడం కేంద్రంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. ఉద్యమించి విజయం సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ప్రజావ్యతిరేక విధానాలపై ఇదే రీతిలో ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News