HomeతెలంగాణRevanth Reddy | 21 ఏళ్లకే ఎన్నికల పోటీ ?

Revanth Reddy | 21 ఏళ్లకే ఎన్నికల పోటీ ?

భారతదేశం యువత రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న కానీ వారికి పోటీ చేసే అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉన్నాయని, రాజకీయ వ్యవస్థలో యువతకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యంమత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస వయోపరిమితిని 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలని అయన డిమాండ్ చేసారు.

ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.”21 ఏళ్ల యువకుడు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేయవచ్చు. దేశ పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహించవచ్చు. అలాంటి యువతకు అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు ఉండకూడదు?” అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

భారత రాజ్యాంగం ప్రకారం లోక్ సభ, రాష్ట్ర అసెంబీకీ ఎన్నికల్లో 25 సంవత్సరాలు కావలి దాన్ని మార్టుచాల్సిన సమయసం ఒచ్చిందని రేవంత్ రెడ్డి సూచించారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉంది యువతే అని దేశ నిర్మాణం కూడా యువత చేతుల్లోనే ఉంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.క్లిష్టమైన పరిస్థితిల్లో యువత ఆలోచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు.యువత మీదనే మన భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని గ్రహించి, యువతకు అవకాశాలు కల్పిస్తే రాజకీయల్లో కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం, కొత్త దిశా కనిపిస్తుంది అని రేవంత్ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో జెన్ – జెడ్(Gen -Z) యువత సామజిక , ఆర్ధిక, సాంకేతిక, రంగాల్లో తమ సత్తా చాటుతున్నారాని అదే విధంగా రాజకీయాల్లో కూడా అదే ఉత్సాహం కనిపించాకలి అని రేవంత్ పేర్కొన్నారు.”ఈ యువ సునామీ ఇక్కడితో ఆగకూడదు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు జెన్-జెడ్ గొంతు వినిపించాలి. యువత సమస్యలను యువతే శాసనసభల్లో ప్రస్తావించే పరిస్థితి రావాలి” అని ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగిన భారీ కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News