Friday, June 5, 2026
Homeస్పోర్ట్స్Chess | దూసుకెళ్తున్న ఆర్. ప్రజ్ఞానంద..

Chess | దూసుకెళ్తున్న ఆర్. ప్రజ్ఞానంద..

  • నార్వే చెస్ టోర్నమెంట్ లో భారత ప్లేయర్ ప్రతిభ..
  • 34 ఎత్తుల్లోనే గుకేశ్ ని మట్టికరిపించిన ప్రజ్ఞానంద..

నార్వే చెస్ టోర్నీలో భార‌తీయ ప్లేయ‌ర్ ఆర్ ప్ర‌జ్ఞానంద దూసుకెళ్తున్నాడు. ఆ టోర్నీలో ప్ర‌స్తుతం అత‌ను రెండో స్థానంలో నిలిచాడు. అయితే వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌, మ‌రో భార‌త ఆట‌గాడు డీ గుకేశ్‌పై అద్భుతమైన విజ‌యాన్ని ప్ర‌జ్ఞానంద న‌మోదు చేశాడు. కీల‌క‌మైన మ్యాచ్‌లో కేవ‌లం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను మ‌ట్టిక‌రిపించాడు. రెండు రో్జుల క్రితమే గుకేశ్ త‌న 20వ పుట్టిన రోజు జ‌రుపుకున్నాడు. అయితే ఈ విక్ట‌రీ ప్ర‌జ్ఞానంద‌కు ప్ర‌తీకార విజ‌యం అవుతుంది. ఈ టోర్నీలోనే నాలుగ‌వ రౌండ్‌లో గుకేశ్ చేతిలో ప్ర‌జ్ఞానంద ఓడిపోయారు.

గుకేశ్‌పై గెలుపుతో టైటిల్ రేసుకు ప్ర‌జ్ఞానంద చేరువ‌య్యారు. వ‌రుస‌గా మూడు విక్ట‌రీల‌తో మ‌ళ్లీ ఊపందుకున్నాడు. మూడు రోజుల క్రితం వెనుక‌బ‌డ్డ నేను ఇప్పుడు టైటిల్ రేసులో ఉన్న‌ట్లు ప్రజ్ఞానంద తెలిపారు. గ‌త ఏడాది నార్వే చెస్ టోర్నీలో గుకేశ్‌, కార్ల్‌స‌న్ మ‌ధ్య తీవ్ర పోటీ ఉండే. అయితే ఈ ఏడాది కార్ల్‌స‌న్ పెద్ద‌గా ప‌ర్ఫార్మ్ చేయ‌లేక‌పోయాడు. గుకేశ్‌కు 8 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో వెస్లే అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌ను 15.5 పాయింట్ల‌తో దూసుకెళ్తున్నాడు. ప్ర‌జ్ఞానంద 15 పాయింట్ల‌తో టైట్ ఫైట్ ఇస్తున్నాడు. ఇక మూడ‌వ స్థౄనంలో 14.5 పాయింట్ల‌తో అలిరెజా ఫిరౌజా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News