Sunday, May 31, 2026
Homeకెరీర్ న్యూస్Reopening | విద్యార్ధులకు అలర్ట్..

Reopening | విద్యార్ధులకు అలర్ట్..

  • నేటితో ముగిసిన వేసవి సెలవులు! రేపట్నుంచి తరగతులు షురూ

రాష్ట్ర విద్యార్ధులకు ఇంటర్ బోర్డు కీలక అప్‌డేట్ జారీ చేసింది. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం రేపట్నుంచి ఇంటర్ కాలేజీలు తెలరచుకోనున్నాయి.

ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ విద్యార్ధుల కోసం జూనియర్‌ కాలేజీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. వేసవి సెలవుల అనంతరం సోమవారం (జూన్ 1) నుంచి జూనియర్‌ కాలేజీలు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇప్పటికే విడుదల చేసింది. జూన్‌ 1 నుంచే ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ క్లాసులు ప్రారంభిస్తామని ఇంటర్‌బోర్డు అధికారులు గతంలోనే వెల్లడించారు.

- Advertisement -

మరోవైపు ఏపీలోనూ ఇంటర్ తరగతులు జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కావల్సి ఉంది. అయితే మండే ఎండల తీవ్రత దృష్ట్యా వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించారు. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కాలేజీలు జూన్‌ 6వ తేదీ నుంచి మొదలవనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News