Sunday, May 24, 2026
Homeబిజినెస్Stocks | బెస్ట్ షేర్లను సూచించిన బ్రోకింగ్ నిపుణులు..

Stocks | బెస్ట్ షేర్లను సూచించిన బ్రోకింగ్ నిపుణులు..

  • రూ. 100 లోపు లభిస్తున్న షేర్లు బెటర్..
  • ఓలా, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, ఆదిత్య బిర్లా బలంగా ఊన్నాయి..
  • ఈ షేర్లు కొంటే మంచి లాభాలొస్తాయని సూచన..

బ్యాంకింగ్ రంగం మద్దతుతో నిఫ్టీ 23,719 వద్ద సానుకూలంగా ముగిసిన నేపథ్యంలో, మే 25 సోమవారం నాటి ట్రేడింగ్ కోసం ఛాయిస్ బ్రోకింగ్ నిపుణులు మూడు బెస్ట్ బడ్జెట్ షేర్లను సూచించారు. రూ. 100 లోపు లభిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అదిత్య బిర్లా ఫ్యాషన్ స్టాక్స్ టెక్నికల్ పరంగా బలంగా ఉన్నాయని, కఠినమైన స్టాప్ లాస్‌లు సెట్ చేసుకుని మంచి లాభాలు సాధించవచ్చని పేర్కొన్నారు. గత శుక్రవారం మార్కెట్లు లాభాల్లో ముగియడం ఇన్వెస్టర్లలో పాజిటివ్ వైబ్స్ పెంచింది. సె

న్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 75,415 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 23,719 వద్ద స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో అంటే రూ. 100 లోపు ధరలో ఉండి, షార్ట్ టర్మ్‌లో మంచి లాభాలు తెచ్చిపెట్టే మూడు బెస్ట్ షేర్లను ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా రికమండ్ చేశారు. డైలీ టైమ్‌ఫ్రేమ్‌లో ఇన్వర్టెడ్ హ్యామర్ లాంటి క్యాండిల్‌స్టిక్ పాటర్న్ స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -

దిగువ స్థాయిల నుండి కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నప్పటికీ, ఎగువ స్థాయిల వద్ద లాభాల స్వీకరణ ఒత్తి డి కొనసాగుతోంది. ప్రస్తుతానికి నిఫ్టీకి 23,400–23,450 పరిధిలో తక్షణ సపోర్ట్ ఉండగా, 23,850 నుండి 23,900 స్థాయిల మధ్య బలమైన రెసిస్టెన్స్ ఎదురవుతోంది. ఆర్‌ఎస్‌ఐ (RSI) 47.19 వద్ద ఉండటం మొమెంటం క్రమంగా పుంజుకుంటోందని చెప్తోంది.” అన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News