Tuesday, May 19, 2026
Homeవరంగల్‌Annaram Sharif | గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.

Annaram Sharif | గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.

  • తెలంగాణ స్టేట్ వక్బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లాకు వినతి పత్రం.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, గ్రామ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసి గ్రామపంచాయతీ పాలకమండలి, గ్రామంలోని వివిధ పార్టీల నాయకులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయుబ్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ వక్బోర్డు చైర్మన్ అజ్మతుల్లాను కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పాలకమండలి, గ్రామ అభివృద్ధి కమిటీ కోరిక మేరకు నిధులు మంజూరు చేయుటకు వర్బ్బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ స్థానిక సర్పంచ్ మహేందర్ ఆధ్వర్యంలో వర్బ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లాను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వర్బ్బోర్డు చైర్మన్ స్థానిక సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్ ను వర్బ్బోర్డు చైర్మన్ అజ్మతుల్లా శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్, గ్రామ సీనియర్ నాయకులు గొడుగు బిక్షపతి, గ్రామ పార్టీ అధ్యక్షులు గొడుగు రమేష్, గొడుగు వినయ్, పాలకమండలి సభ్యులు రామకృష్ణ, ముంజంపల్లి నాగరాజు, రాపోలు అనిత రవీందర్, కొండేటి కొమురమ్మ రామచందర్, దొంతమల పవన్ కళ్యాణ్, పస్తాం రాధిక సుధాకర్, బత్తిని జలంధర్ గ్రామానికి చెందిన ప్రముఖులు ఉమ్మ గాని రవీందర్, డాక్టర్ బాబు, మోటపోతుల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News