- బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం ఆదేశాల మేరకు
బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని SC కాలనీ 3 వవార్డు లో నూతన బోర్వెల్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుగ్నేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ డోలే సురేష్ హాజరై బోర్వెల్ పనులు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమంలో PACS డైరెక్టర్ డోలే దేవమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసిపాక విజయ్, 3 వ వార్డు సభ్యులు డోలె హరికృష్ణ పాల్గొన్నారు. యువకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు ప్రజలకు నీళ్ళ సమస్య ఉన్నది అని ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే బోరువేల్ వేయించడంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
